Infinix Note 50X: రూ.12 వేల లోపు 5G ఫోన్ కావాలా? అయితే ఒకసారి ఇన్ఫినిక్స్ నోట్ 50X చూడండి.! 4 d ago

featured-image

ఇన్ఫినిక్స్ కంపెనీ ఈ సంవత్సరానికి తమ మొదటి స్మార్ట్‌ఫోన్.. Infinix Note 50X ను విడుదల చేసింది. ఈ ఫోన్ తక్కువ ధరలో రోజువారీ అవసరాలకు సరిపోయేలా రూపొందించబడింది. ఇందులో మంచి ప్రాసెసర్, పెద్ద బ్యాటరీ, మరియు మన్నికైన డిజైన్ ఉన్నాయి. ఈ ఫోన్ సాఫ్ట్‌వేర్ కూడా ఆధునిక ఫీచర్లతో వస్తుంది. దీని డిజైన్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. నీరు మరియు దుమ్ము నిరోధకత కోసం ఇది IP64 రేటింగ్ ను కలిగి ఉంది. నిజానికి ఈ ఫోన్ మధ్యతరగతి వినియోగదారులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ ఫీచర్ల వైపు ఒక లుక్ వేద్దా రండి.!


Infinix Note 50X ఫీచర్లు:

డిస్‌ప్లే: 6.67-అంగుళాల IPS LCD డిస్‌ప్లే

రిఫ్రెష్ రేటు: 120 Hz

ప్రాసెసర్: MediaTek Dimensity 7300 Ultimate

ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ v15

బరువు: 195.4 గ్రాములు

బ్యాటరీ: 5500 mAh

ఛార్జింగ్: 45W ఫాస్ట్ ఛార్జింగ్


కెమెరా ఫీచర్లు:

బ్యాక్ కెమెరా:

  • 50 MP మెయిన్ కెమెరా
  • 2 MP డెప్త్ కెమెరా

ఫ్రంట్ కెమెరా: 8 MP


వేరియంట్స్:

  • 6GB RAM + 128GB స్టోరేజ్
  • 8GB RAM + 128GB స్టోరేజ్


కనెక్టివిటీ ఫీచర్లు:

  • 5G, 4G డ్యూయల్ సిమ్
  • Wi-Fi 6
  • బ్లూటూత్ v5.4, GPS
  • 3.5 mm ఆడియో జాక్


సెన్సార్లు: ఫింగర్‌ప్రింట్ సెన్సార్ (సైడ్), లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలెరోమీటర్, కంపాస్, గైరోస్కోప్.


కలర్ ఆప్షన్స్:

  • సీ బ్రీజ్ గ్రీన్ (వీగన్ లెదర్ ఫినిష్)
  • ఎన్‌చాంటెడ్ పర్పుల్
  • టైటానియం గ్రే


ఫోన్ ధర:

  • 6GB RAM, 128GB స్టోరేజ్-- రూ.11,499
  • 8GB RAM, 128GB స్టోరేజ్-- రూ.12,999


ప్లస్ పాయింట్స్:

  • IP64 వాటర్ మరియు డస్ట్ రెసిస్టెన్స్
  • ప్రీమియం లుక్
  • ఈ ధరకి బెస్ట్ ప్రాసెసర్ (MediaTek Dimensity 7300 Ultimate)


మైనస్ పాయింట్స్:

  • NFC లేదు.
  • IPS LCD HD+ డిస్‌ప్లే
  • కెమెరా నాణ్యత కొంతమందికి నచ్చకపోవచ్చు


ఇంత తక్కువ ధరకి ఇంత మంచి ఫోన్‌ను ఇన్ఫినిక్స్ అందిస్తుందంటే చాలా గొప్ప విషయమే. సాధారణంగా ఈ ధరలో ఇలాంటి ఫీచర్లు కలిగిన ఫోన్లు లభించడం చాలా కష్టం. ఇన్ఫినిక్స్ ఫోన్లలో సాఫ్ట్‌వేర్ లోపాలు తరుచుగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ ధరకి..ఇది చాల మంచి ఫోన్ అనే చెప్పాలి. రోజువారీ వినియోగానికి ఈ ఫోన్ చాలా బాగుంటుంది. మంచి ప్రీమియం లుక్ తో వినియోగదారులను బాగా ఆకట్టుకుంటుంది. MediaTek ప్రాసెసర్ వల్ల‌ ఇది గేమింగ్ కి కూడా చాల బాగుంటుంది. తక్కువ ధరలో మంచి ప్రీమియం ఫోన్ కోరుకునేవారికి ఇది మంచి ఎంపిక. ఏప్రిల్ 3వ తేదీ నుండి ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానుంది. 



ఇది చదవండి: అందరికీ అందుబాటులో Realme P1..మంచి ఫీచర్లతో బెస్ట్ ఫోన్!


Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD